భారత్‌లో కొత్త ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ & హెక్టర్ ప్లస్ 7 సీటర్ లాంచ్ : ధర, వివరాలు

ప్రముఖ వాహన తయారీదారు ఎంజి మోటార్స్ తన ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మరియు హెక్టర్ ప్లస్ 7 సీటర్ ఎస్‌యూవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 12.89 లక్షలు కాగా, హెక్టర్ ప్లస్ 7 సీటర్ ఎస్‌యూవీ ధర రూ. 13.34 లక్షలు.

ఎంజి మోటార్ కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఎస్‌యూవీలు మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్నాయి. ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం, డిజైన్ మరియు ఇంటీరియర్స్ ఎక్కువ అప్డేట్ చేయబడ్డాయి.

దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి కంపెనీ యొక్క డీలర్‌షిప్‌లు మరియు అధికారిక వెబ్‌సైట్లలో ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్ ప్రారంభించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో తీసుకురాబడింది. ఇందులో దాని టాప్ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 18.32 లక్షలు. ఇది డీలర్‌షిప్‌లో గుర్తించబడింది. కావున డెలివెరీ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

2021 MG Hector Price
Variant Petrol Diesel
Style MT ₹12,89,800 ₹14,20,800
Super MT ₹13,88,800 ₹15,30,800
Super Hybrid ₹14,39,800
Smart MT ₹16,91,800
Smart Hybrid ₹15,65,800
Smart DCT ₹16,41,800
Sharp MT ₹18,32,800
Sharp Hybrid ₹16,99,800
Sharp DCT ₹17,99,800

MOST READ:భారత్‌లో కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన జీప్ : పూర్తి వివరాలు

ఈ కొత్త ఎస్‌యూవీలో అప్డేట్ చేసిన మార్పులను గమనించినట్లయితే, కొత్త ఎంజి హెక్టర్‌కు కొత్త గ్రిల్‌తో పాటు 18ఇంచే డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్ ఇవ్వబడింది. ముందు భాగంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ఫాగ్ లాంప్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పెద్ద ఎయిర్ డ్యామ్ వంటివి కూడా ఉన్నాయి.

ఇందులో ఉన్న ఇంటీరియర్స్ గమనించినట్లయితే, ఇందులో పాత మోడల్ యొక్క అన్ని బ్లాక్ థీమ్ కి బదులుగా, కొత్త డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఇవ్వబడింది. ఇది క్యాబిన్ యొక్క వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, అప్‌డేట్ చేసిన ఐ-స్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.

MOST READ:గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

కొత్త హెక్టర్‌లో ఆటో డిమ్మింగ్ ఐఆర్‌విఎం, 10.4 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, రియర్ ఎసి వెంట్స్, డ్యూయల్ పెన్ సన్‌రూఫ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

2021 MG Hector Plus 6 Seater Price
Variant Petrol Diesel
Super MT ₹15,99,800
Smart MT ₹17,61,800
Smart DCT ₹17,11,800
Sharp MT ₹19,12,800
Sharp Hybrid ₹17,74,800
Sharp DCT ₹18,79,800

కొత్త హెక్టర్ ప్లస్ 7 సీటర్ చూడటానికి 6 సీట్ల మాదిరిగానే ఉంటుంది. అయితే దాని రెండవ వరుసలో, కెప్టెన్ సీటుకు బదులుగా బెంచ్ సీటు అమర్చబడి ఉంటుంది. హెక్టర్ ప్లస్ 7 సీటర్ ధర రూ. 13.34 లక్షల నుంచి రూ. 18.32 లక్షల వరకు ఉంటుంది. అదే 6 సీట్ల ధర రూ .15.99 లక్షల నుంచి రూ. 19.12 లక్షల వరకు ఉంటుంది.

2021 MG Hector Plus 7 Seater Price
Variant Petrol Diesel
Style MT ₹13,34,800 ₹14,65,800
Super MT ₹15,75,800
Super Hybrid ₹14,84,800
Smart MT ₹17,51,800
Select MT ₹18,32,800

MOST READ: అద్భుతంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టీజర్.. ఓ లుక్కేయండి

ఇందులో 1.5 లీటర్ల పెట్రోల్ మరియు 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 141 బిహెచ్‌పి శక్తిని, 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 168 బిహెచ్‌పి శక్తిని, 350 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. లైట్ వెయిట్ హైబ్రిడ్ సెటప్‌ను పెట్రోల్‌లో కూడా ఇవ్వవచ్చు. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ప్రామాణికంగా కలిగి ఉంది.

ఎంజి మోటార్ యొక్క ఈ మూడు మోడళ్ల అమ్మకాలు ఈ రోజు నుండి ప్రారంభించబడ్డాయి. కస్టమర్లు కూడా ఈ రోజు నుంచి సమీప డీలర్‌షిప్‌ను సందర్శించడం తెలుసుకోవచ్చు. ఎంజి మోటార్ పూర్తి సన్నాహాలతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇక అమ్మకాలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవడానికి కొంత కలం వేచి చూడాలి. ఈ కొత్త మోడల్స్ మంచి అమ్మకాలను సాధించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

MOST READ: బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

Most Read Articles

English summary
MG Hector Facelift And Hector Plus 7 Seater Launched In India: Price, Features. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X