Just In
- 35 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 45 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 54 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Movies
Check 1st day collections: బాక్సాఫీస్ వద్ద నితిన్ స్టామినా.. తొలి రోజు ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హైదరాబాద్‌లో మళ్ళీ ప్రారంభం కానున్న డబుల్ డెక్కర్ బస్ సర్వీస్..ఎప్పుడంటే?
హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు అంటే 1990 కాలంలో నిజాం పరిపాలన సమయంలోనే డబుల్ డెక్కర్ బుస్సులు వాడకంలో ఉండేవి. కానీ తరువాత కాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ డబుల్ డెక్కర్ బస్సులు నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు తిరగాలని సంకల్పంతో సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ డబుల్ డెక్కర్ బస్సులను హైదరాబాద్ మహా నగరంలో వాడుకలోకి తీసుకువస్తుందని నివేదించబడింది. సుమారు 20 సంవత్సరాల తరువాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి బస్సులను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. ఈ బస్సులను హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది.

ఒక కమిటీ అందించిన నివేదికల ప్రకారం, డబుల్ డెక్కర్ బస్సులు సికింద్రాబాద్- పటాంచెరు, సుచిత్రా, కోటి-పటాంచెరు, సిబిఎస్-జీడిమెట్ల మరియు అఫ్జల్ గుంజ్-మెహదీపట్నం ద్వారా సికింద్రాబాద్-మేడ్చల్ మార్గాల్లో తిరగనున్నాయి.
MOST READ:హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న డబుల్ డెక్కర్ బస్ సర్వీస్

మొదటి దశలో 25 యూనిట్ల నాన్-ఎసి డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్ ప్రకటించారు. బీఎస్- VI ఉద్గార ప్రమాణాలు, సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు మరియు తెలంగాణ రాష్ట్ర మోటారు వాహన నిబంధనలకు లోబడి డీజిల్ ద్వారా బస్సులు నడపబడతాయి.

ఈ టెండర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఈ బస్సులు పూర్తిగా దేశీయంగా ఉత్పత్తి కానున్నాయి. అందువల్ల, డబుల్ డెక్కర్ బస్సులు పూర్తి దేశీయ ఉత్పత్తిగా వాడుకలోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ బస్సులు ప్రవేశపెట్టిన తరువాత, నిర్వహణ యొక్క లాభాలు మరియు నష్టాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
MOST READ:అరుదైన లగ్జరీ కార్లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]

ఈ స్పెషల్ కమిటీ హైదరాబాద్ మాత్రమే కాకుండా సికింద్రాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాలను కూడా అన్వేషిస్తోంది. వారి అధ్యయనం తరువాత, ఏ ప్రాంతాలలో డబుల్ డెక్కర్ బస్సులను నడపడానికి తగిన సౌకర్యాలు ఉన్నాయో, ఆయా ప్రాంతాలలో డబుల్ బస్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తారు.

ప్రస్తుతం బస్సుల కొరత కారణంగా విద్యార్థులు, యువకులు బస్సుల యొక్క ఫుట్ బోర్డు మీద వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ఐటి డివిజన్ మంత్రి కె.డి.రామారావు రాష్ట్రంలోని డబుల్ డెక్కర్ బస్సులను పునరుద్ధరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.
MOST READ:కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభమైతే పాఠశాల పిల్లలు, కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు మరియు రోజు వారి కార్మికులకు చాలా అనుకూలంగా ఉటుంది. ముఖ్యంగా ప్రయాణికులు మెట్లపైనా వేలాడుతూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. ఏది ఏమైనా డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో మనం తెలుగు రాష్ట్రంలో ప్రయాణించనున్నాయి.
Note: Images are representative purpose only.