[వీడియో] కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

Written By:

ఇండియన్ రోడ్ల మీద హెల్మెట్ ధరించకుండా ఈగల్లా దూసుకెళ్లే రైడర్లకు కొదవేలేదు. రద్దీతో కూడిన ప్రతి రహదారి మీద తల పొగరుతో విపరీతమైన వేగంతో స్వైర విహారం చేసే రైడర్లను ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం. కానీ, ఈ సంఘటన వీటన్నింటి కంటే భిన్నమైనది.

 కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

తల్లి స్కూటర్ నడుపుతుంటే వెనుక కూర్చున్న కొడుకు కూర్చున్నాడు. వీరికి తోడు ముందువైపు కూతురు కూడా నిలబడి ఉంది. వీరిలో ఏ ఒక్కరికీ హెల్మెట్ లేదు. అసలు మ్యాటర్ ఇది కాదు. గుండె గుబేలుమనిపించే ఓ సంఘటన జరిగింది.

 కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

అత్యంత భయంకరమైన మరియు ప్రమాదకరమైన సంఘటన స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న పిల్లాడు స్కూటర్‌లో వెనుక వైపున కూర్చొని సీటు మీద హోం వర్క్ చేస్తున్నాడు. స్కూటర్ మీద ముగ్గురు ఉంటే ఒక్కరు కూడా హెల్మెంట్ ధరించలేదు.

 కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

అన్నింటికీ మించి, ఆ అబ్బాయి మహా అయితే ప్రైమరీ స్కూల్‌కు వెళుతుంటాడు. కానీ, సమయం మించిపోయిందనే నెపంతో స్కూటర్ మీదే అసైన్‌మెంట్ ముగించాలనే ఆతృతో ప్రమాదకరైన స్థితిలో కూర్చుని హోం వర్క్ చేస్తున్నాడు.

 కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

అదుపు తప్పితే ఆ అబ్బాయి బ్యాలెన్స్ కోల్పోయి క్రింద పడిపోతాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా, సీటుకు చివరిలో వ్రేళాడే తరహా వెనుక వైపున హ్యాండిల్ గార్డ్ సహాయంతో అత్యంత ఇబ్బందికరంగా కూర్చుని హోం వర్క్ మీద దృష్టి పెట్టాడు.

 కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

ఏదేమైనప్పటికీ, మన ఇండియన్ రోడ్ల మీద అడుగడుగునా అడుగు లోతు మేర గుంతల సహజమే. గుంతలమయమైనన ఎగడుదిగుడు రోడ్లు ఎదురై స్కూటర్ కుదుపులకు గురైతే, హోం వర్క్ చేస్తున్న పిల్లాడు ఎగిరి క్రింద పడటం ఖాయం.

ఓ టూ వీలర్ రైడర్ తీసిన వీడియో ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. జరగరాని ఘోరం జరిగితే పరిస్థితి ఏంటని ఆలోచించని వారుండరు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడయాలో వైరల్‌గా వ్యాపించింది.

 కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

టూ వీలర్ రైడర్లు సరైన భద్రతను పాటించడాన్ని ఇప్పటికైనా ప్రారంభించాలి. ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టకుండా తప్పించుకోడానికో... లేదంటే మొక్కుబడిగా ఉండాలంటే ఉండాలి అనే ఉద్దేశంతో రోడ్డు నియమాలు మరియు సేఫ్టీని పాటిస్తున్నారు.

 కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

ట్రాఫిక్ రూల్స్ మరియు హెల్మెట్ ధరించడం వంటి సేఫ్టీ రూల్స్ పాటించడాన్ని పోలీసులు మరియు ప్రభుత్వాలు తప్పనిసరిగా చేసింది మన భద్రత కోసమే. అన్ని విధాలు రహదారి నియమాలు మరియు సేఫ్టీని పాటిస్తే ఏ అధికారికీ జరిమానా చెల్లించకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ఇంటిని చేరుకోవచ్చు.

 కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

హెల్మెట్ గురించి ఎవరు ప్రస్తావించినా... లైట్ తీసుకో మామా అంటుంటారు. కానీ, గణాంకాలు చూస్తే నివ్వరపోయే సంఖ్యలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఒక్క 2016లోనే 50,000 మందికి పైగా కేవలం హెల్మెట్ ధరించకపోవడం వలన మరణించారు.

 కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

భారత్‌లో కొన్ని లక్షల మంది టూ వీలర్ రైడర్లు ఉన్నారు. ఈ 50,000 మందిలో పొరబాటున మనలో ఎవరైనా ఉంటే, మనల్ని కోల్పోయిన కుటుంబ సభ్యుల భాదను వర్ణించలేము. కాబట్టి, ధర ఎక్కువైనా పర్వాలేదు, ఐఎస్ఐ గుర్తింపు ఉన్న మంచి హెల్మెట్ తీసుకొని ఏ చిన్న అవసరానికైనా, ఎంత చిన్న దూరమైనా హెల్మెట్ ధరించడాన్ని పరిపాటిగా చేసుకోండి.

దయచేసి మీ కుటుంబానికి మీ లోటును మిగల్చకండి....

 కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

1. 8 నెలల గర్భవతిని కారుతో తొక్కించిన 14 ఏళ్ల బాలుడు

2.ఈ కారు నడిపిన డ్రైవర్ మామూలోడు కాదు!!

3.400 అడుగుల లోయలోకి పడిపోయిన ఎండీవర్: అందరూ సేఫ్!

4.తలక్రిందులైన టాటా నెక్సాన్: ప్రయాణికులంతా సేఫ్!!

5.హైదరాబాద్-బెంగళూరు హైవే మీద ఘోర ప్రమాదం!!

English summary
Read In Telugu: Kid doing homework on a moving scooter is the CRAZIEST thing you’ll see today [Video]
Story first published: Friday, March 30, 2018, 11:33 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark