2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన బెస్ట్ కార్లు

Written By:

2017లో ఏడాది పొడవునా విడుదలైన కొత్త కార్లలో నాణ్యత, భద్రత మరియు కస్టమర్ల సంతృప్తిగా ఆధారంగా కొన్ని బెస్ట్ కార్లను సంవత్సరాంతం సందర్భంగా డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీ కోసం ప్రత్యేక కథనం ద్వారా తీసుకొచ్చింది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

కార్ల కంపెనీలు ప్రజల మన్ననలు పొందుతూనే పోటీ ప్రపంచంలో రాణించేందుకు అధునాతన డిజైన్, ఫీచర్లు, నిర్మాణపరమైన నాణ్యత, ధరకు తగ్గ విలువలతో ఎన్నోకొత్త కార్లను లాంచ్ చేశాయి. వాటిలో కొన్ని కార్లు అనతి కాలంలోనే భారీ సక్సెస్ అందుకుంటే మరికొన్ని కార్లు అప్పటికప్పుడే కనుమరుగయ్యాయి. ఏదేమైనప్పటికీ ఈ ఏడాదిలో విడుదలైన అతి ముఖ్యమైన కార్ల జాబితాలో ఏయే కార్లున్నాయో చూద్దాం రండి.

Recommended Video - Watch Now!
Upcoming Cars India 2018 - DriveSpark
 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

జీప్ కంపాస్

పేరుకు అమెరికన్ బ్రాండ్ అయినప్పటికీ, జీప్ ఇండియా విభాగానికి మన మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. జీప్ కంపాస్ ఇండియన్ మార్కెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కుడివైపు స్టీరింగ్ వీల్ ఉన్న వాహనాలను అనుమతించే అన్ని దేశాల్లో అతి ప్రధానమైన లాంచ్‌గా నిలిచింది. లగ్జరీ కార్లను తయారు చేసే జీప్ అతి తక్కువ ధరతో కంపాస్‌ను లాంచ్ చేసి, ఆటో ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

అత్యుత్త స్టైలిష్ డిజైన్ గల అత్యుత్తమ ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీగా జీప్ కంపాస్ నిరూపించుకుంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న ఇతర ఎస్‌‌యూవీలకు జీప్ కంపాస్ గట్టి పోటీనిస్తోంది. ధరకు తగ్గ విలువలతో, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లతో విభిన్న రకాల వేరియంట్లలో ఇండియన్స్‌ను ఎంతగానో అకట్టుకుంటోంది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

2. మారుతి సుజుకి డిజైర్

విడుదలైన వెంటనే భారీ స్పందన లభించిన కార్లలో న్యూ డిజైర్ ఒకటి. మునుపటి తరానికి చెందిన స్విఫ్ట్ డిజైర్ కారులో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా భారీ మార్పులు చేర్పులు చేసి కేవలం న్యూ డిజైర్ అనే పేరుతో మాత్రమే లాంచ్ చేసిన మారుతికి డిజైర్ చుక్కలు చూపించింది. విడుదలైన తొలినాళ్లలో డిమాండుకు తగిన ఉత్పత్తి మరియు డెలివరీలు చేయలేక మారుతి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

న్యూ డిజైర్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన ఆల్టో స్థానాన్ని డిజైర్ ఆక్రమించింది. అంతే కాకుండా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు ప్రాణసంకటంగా పరిణమించింది. సగటు భారతీయుడు కోరుకునే రీతిలో రూపొందించడంతో భారీ విజయాన్ని అందుకుంది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

3. టాటా నెక్సాన్

దేశీయంగా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ రోజు రోజుకీ అధిక పాపులారిటీ లభిస్తోంది. ఈ విభాగంలో మారుతి సుజుకి వితారా బ్రిజా మార్కెట్ లీడర్‌గా ఆధిపత్యం చెలాయిస్తోంది. సరిగ్గా వితారా బ్రిజాకు పోటీనిచ్చే లక్ష్యంతో టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా కతమ తమ మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌ను లాంచ్ చేసింది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

మా అభిప్రాయం మేరకు, బ్రిజా మరియు టియువి300 వాహనాలతో పోల్చుకుంటే టాటా నెక్సాన్ స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా టాటా ఇందులో అత్యంత శక్తివంతమైన 1.5-లీటర్ డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్ అందించింది. దీనికి తోడు మరే ఇతర ఎస్‌యూవీలలో లేనటువంటి ఫస్ట్ క్లాస్ ఫీచర్లను పరిచయం చేసింది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

4. హ్యుందాయ్ వెర్నా

ఇండియన్ మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెర్నాకు ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉండేది. అయితే, విడుదలయ్యి సంవత్సరాలైనా ఎలాంటి అప్‌డేట్స్ పొందకపోవడంతో వెర్నాకు బదులుగా హోండా సిటి కారు ఆదరణ ఎక్కువయ్యింది. దీనికి తోడు మారుతి సియాజ్ కూడా వెర్నా గట్టి పోటీనిచ్చింది. హ్యుందాయ్ తమ పూర్వవైభవాన్ని వెనక్కి తెచ్చుకునేలా కొత్త తరం వెర్నా సెడాన్ కారును భారీ హంగులతో లాంచ్ చేసింది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

ఇండియన్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో ప్రతిష్టాత్మక అవార్డుగా పేరుగాంచిన ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2017 ఏడాదికి గాను హ్యుందాయ్ వెర్నా దక్కించుకుంది. అప్పటి వరకు వెయ్యి లోపు ఉన్న విక్రయాలు, దీని విడుదలతో అమాంతం ఊపందుకున్నాయి.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

5. రెనో క్యాప్చర్

దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో చొచ్చుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ధరకు తగ్గ విలువలతో వచ్చిన క్విడ్ హ్యాచ్‌బ్యాక్ చేసిన అలజడి అంతా ఇంత కాదు. డస్టర్ మరియు క్విడ్ కార్లతో సక్సెస్ రుచి చూసిన రెనో విపణిలోకి తమ నాలుగవ మోడల్‌గా ప్రీమియమ్ క్రాసోవర్ ఎస్‌యూవీ "క్యాప్చర్"ను లాంచ్ చేసింది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

భారత్‌లో తయారైన విడి భాగాలతో ఈ అంతర్జాతీయ క్రాసోవర్ ఎస్‌యూవీ "క్యాప్చర్‌"ను ధరకు తగ్గ విలువలతో అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాలమైన క్యాబిన్ స్పేస్, అధునాతన ఫీచర్లు, రోడ్ల మీద అద్భుతమైన లుక్ మరియు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలదు.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

6. టాటా హెక్సా

టాటా మోటార్స్ 2017 ఏడాది ప్రారంభంలో క్రాసోవర్ డిజన్ శైలి మరియు ఎస్‌యూవీ లక్షణాలతో హెక్సా వెహికల్‌ను లాంచ్ చేసింది. టాటా లైనప్‌లో ప్రసిద్ద సఫారీ తరువాత రెండవ ఎస్‌యూవీగా హెక్సా నిలిచింది. ఇప్పటి వరకు ఎలాంటి కస్టమర్ కంప్లయింట్స్ లేకుండా, ఎంతో మంది సంతృప్తి చెందిన కస్టమర్లతో విజయవంతంగా విక్రయించబడుతోంది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్ విడుదలతో తమ ఫ్యూచర్ మోడళ్ల డిజైన్ అంశాలను పూర్తిగా మార్చేసింది. ఇంపాక్ట్ డిజైన ఫిలాసఫీలో వచ్చిన హెక్సా టాటా మోటార్స్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ధరకు తగ్గ విలువలతో కూడిన హెక్సా మీద సానుకూల స్పందన లభించింది. హెక్సాలో అత్యంత వివేకవంతమైన ఎలక్ట్రిక్ పవర్ ద్వారా కంట్రోల్ అయ్యే అడాప్టివ్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

7. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ మార్కెట్లోకి తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేసిన కంపెనీ ఫోర్డ్. ఫోర్డ్ ఇండియా విపణిలోకి తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఎకోస్పోర్ట్ ను లాంచ్ చేసింది. విడుదలైన తొలినాళ్లలో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ బ్రిజా మరియు నెక్సాన్ వంటి ఎస్‌యూవీల రాకతో ఎకోస్పోర్ట్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో డిజైన్ పరంగా మార్పులు చేసి, నూతన ఫీచర్లు అందించి ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్ ను విడుదల చేసింది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

భారీ మార్పులకు గురైన సరికొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ అవే పాత ధరలతోనే విడుదలవ్వడం గమనార్హం. పోటీని ఎదుర్కునే క్రమంలోనే ప్రవేశపెట్టిన ఫేస్‌లిఫ్ట్‌ ఎకోస్పోర్ట్‌లో సరికొత్త 1.5-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేసింది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

8. హోండా డబ్ల్యూఆర్-వి

హోండా మోటార్స్ జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది. డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీని స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ అని చెప్పవచ్చు. సన్ రూఫ్, ఫుల్లీ ఫోల్డబుల్ రియర్ సీట్స్, ఆటోమేటిక్ ఏసి, క్రూయిజ్ కంట్రోల్, పవర్ ఫోల్డింగ్ మరియు అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

ప్రీమియమ్ ఫీచర్లతో పాటు భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లను డబ్ల్యూఆర్-విలోని అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందించింది. ప్రస్తుతం హోండా ఇండియా లైనప్‌లో సిటి సెడాన్ తరువాత అత్యుత్తమ అమ్మకాలు సాధించిపెడుతున్న రెండవ మోడల్‌గా డబ్ల్యూఆర్-వి నిలిచింది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

9. మారుతి సుజుకి ఇగ్నిస్

యువ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ మోడ్రన్ మరియు స్టైలిష్ డిజైన్‌లోమారుతి సుజుకి ఇగ్నిస్ క్రాసోవర్‌ను లాంచ్ చేసింది. మారుతికి 2017లో ఇగ్నిస్ అతి ముఖ్యమైన విడుదల. ప్యాసింజర్ కార్ల విపణిలో కోకొల్లలుగా ఉన్న సాధారణ కార్లకు కాస్త భిన్నంగా ఇగ్నిస్ రాక కొద్దిగా నూతనత్వాన్ని తీసుకొచ్చింది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

క్రాసోవర్ వెర్షన్‌గా చెప్పుకునే ఇగ్నిస్ కారులో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్, టాబ్లెట్ స్టైల్లో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం ప్రత్యేకమైన ప్యానల్ మరియు ఎన్నో ఇంటీరియర్ స్టైలింగ్ అంశాలు ఇంటీరియర్‌లో ఉన్నాయి.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

10. స్కోడా కొడియాక్

చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఆటో అంతర్జాతీయ విపణిలోకి కొడియాక్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన అనతి కాలంలోనే ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. స్కోడా ఇండియా లైనప్‌లో లభిస్తున్న అత్యంత ఖరీదైన మరియు ఏకైక ఎస్‌యూవీ కొడియాక్. ఇందులో 7-మంది కూర్చునే సీటింగ్ లేవుట్ కలదు.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

స్కోడా ఆటో ఇండియా తమ కొడియాక్ ప్రీమియమ్ ఎస్‌యూవీలో స్మార్ట్ మరియు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అందించింది. హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, కంఫర్ట్ అసిస్ట్, ఆటోమేటిక్‌గా హెడ్ ల్యాంప్స్ వాష్ చేసే ఫీచర్, పానరోమిక్ సన్ రూఫ్, సెన్సార్ ద్వారా ఓపెన్ అయ్యే డిక్కీ డోర్ ఇంకా ఎన్నో కొత్త ఫీచర్లు ఉన్నాయి.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

11. స్కోడా ఆక్టావియా ఆర్ఎస్

స్కోడా ఆక్టావియా ఇండియన్ మార్కెట్లో పాపులర్ మోడల్. స్కోడా ఈ ఏడాదిలో ఆక్టావియా సెడాన్‌ను స్పోర్టివ్ వెర్షన్‌లో ఆక్టావియా ఆర్ఎస్ పేరుతో లాంచ్ చేసింది. స్కోడా ఇండియా లైనప్‌లో లభించే అత్యంత పవర్‌ఫుల్ సెడాన్ ఆక్టావియా ఆర్ఎస్. 250 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచగా, కేవలం మూడు నెలల్లోపే అన్నీ అమ్ముడయ్యాయి.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 24.62 లక్షలుగా ఉంది. ధర ఏ మాత్రం లెక్కచేయకుండా అన్ని కార్లను కొనుగోలు చేశారు. విపణిలో ఆక్టావియా ఆర్ఎస్ కారుకు ఎలాంటి డిమాండ్ ఉందో ఈ ఫలితాలే చెబుతున్నాయి. సాంకేతింగా ఇందులో 2.0-లీటర్ కెపాసిటి గల టుర్బో పెట్రోల్ ఇంజన్ కలదు. ఆక్టావియా ఆర్ఎస్ కేవలం 6.8 సెకండ్లలో 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం 250కిమీలుగా ఉంది.

 2017లో విడుదలైన బెస్ట్ కార్లు

ఇతర కార్లు

పైన పేర్కొన్న అతి ప్రధాన మోడళ్లతో పాటు, ఇంకా ఎన్నో కార్లు మరియు ఎస్‌యూవీలు మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. అందులో హోండా సిటి అప్‌డేటెడ్ వెర్షన్, మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్, టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ మరియు వోక్స్‌వ్యాగన్ టిగువాన్ వంటివి ఉన్నాయి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Best Cars Of 2017 In India: Our Top Rated Car Launches Of The Year
Story first published: Friday, December 29, 2017, 17:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark